ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న జిల్లా సాధన సమితి నాయకులు
సాధన సమితి నేతల డిమాండ్
పాలకొండ, డిసెంబరు 1: పాలకొండ రెవెన్యూ డివిజన్ను జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక శ్రీకోటదుర్గమ్మ ఆలయ జంక్షన్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధన సమితి నాయకులు మాట్లాడుతూ పాలకొండ డివిజన్ను మూడు ముక్కలు చేయడాన్ని ప్రజలు సహించరన్నారు. పాలకొండ, రాజాం, పాతపట్నం నియోజకవర్గాలతో పాటు బూర్జ మండలాన్ని కలుపుకొని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు, కార్యదర్శి వండాన కూర్మారావు, కణపాక చౌదరినాయుడు, సామంతుల దామోధరరావు, కర్నేన అప్పలనాయుడు, టంకాల దుర్గారావు, సుంకరి సుధాకర్, తాడంగి సునీత, గంటా సంతోష్, గండి రామినాయుడు, సబ్బ నానాజీ తదితరులు పాల్గొన్నారు.