Abn logo
Oct 19 2021 @ 17:04PM

ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సర్వేలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు

న్యూఢిల్లీ: ఐఏఎన్ఎస్-సీ ఓటర్ చేసిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో అత్యుత్తమ సీఎంలపై ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సర్వే చేసింది. దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్‌ బఘేల్ నిలిచారు. ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సర్వేలో ఓటర్లు భూపేష్‌కు జై కొట్టారు. సీఎం కేసీఆర్‌పై ప్రజాగ్రహం పెరిగారు. పట్టికలో అందరికన్నా చివరి స్థానంలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ప్రజాగ్రహ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు 30.30 శాతం మంది ఓట్లు వచ్చినట్లు ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సర్వే వెల్లడించింది.