Abn logo
Sep 24 2021 @ 20:05PM

తొమ్మిది లక్షల అలంకిత్ షేర్ల విక్రయిం... కారణం

హైదరాబాద్ : ఐదారేళ్లుగా పూర్తి ఇన్‌సైడ్ ట్రేడింగ్ తప్ప బయట వ్యాపారం జరగని కౌంటర్లలో అలంకిత్ కూడా ఒకటి. అసలీ కౌంటర్ పేరు కూడా వినని వాళ్లు లక్షల్లో ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఒకరిద్దరు అనలిస్టులు పనిగట్టుకుని మరీ ప్రచారం చేయడమే తప్ప ఈ కౌంటర్‌లో పెద్దగా పస కూడా ఉండదు. కాగా... ఈ రోజు ఈ సంస్థకు చెందిన ప్రమోటర్ అలంకిత్ అసైన్ మెంట్స్ 9,28,445 షేర్లను ఎన్ఎస్ఈలో  బల్క్ డీల్‌ ద్వారా విక్రయించారనే విషయం వెల్లడైంది. ఒక్కో షేరుకు పడిన విక్రయ ధర రూ. 15.55. ఈ బల్క్ డీల్ తర్వాత అలంకిత్ షేరు ఇంట్రాడేలో రూ. 16.15 వరకు  వెళ్లినట్లు రికార్డైంది తప్ప వాస్తవంగా ట్రేడ్ అయిన ధర రూ. 15.85 మాత్రమే.   ఆధార్ డేటా మేనేజ్ మెంట్ సెంటర్లకు సాంకేతిక సహకారాన్ని ఈ సంస్థ ఇస్తున్నట్లు అక్కడక్కడ మాత్రమే కన్పిస్తుంది.