Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంట విరామం, వ్యవసాయానికి స్వస్తి పలకండని మంత్రి పిలుపివ్వడం సిగ్గుగా లేదా?: నిమ్మల

అమరావతి: పంట విరామం, వ్యవసాయానికి స్వస్తి పలకండని మంత్రి కన్నబాబు పిలుపివ్వడం సిగ్గుగా లేదా? అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకివ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లాంటి.. రాయితీల నుంచి తప్పించుకునేందుకే ఈ డ్రామాలని, ప్రభుత్వం స్వలాభం కోసం రైతులకు శిక్ష వేస్తారా? అని మండిపడ్డారు.రైతుల పోరాటానికి కేంద్రం సైతం తలొగ్గిందన్నారు. వ్యవసాయానికి స్వస్తి పలకండనే పిలుపును వెనక్కి తీసుకోకపోతే రైతులే ప్రభుత్వానికి స్వస్తి పలుకుతారన్నారు. వైసీపీ పాలనలో ప్రజల ధన, ప్రాణ, మానానికి రక్షణ లేకుండా పోయిందని, ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వముందని నిమ్మల రామానాయుడు విమర్శించారు.

Advertisement
Advertisement