Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 24 2021 @ 18:02PM

తాతగారైన మాజీ సీఎం కుమారస్వామి

బెంగళూరు: మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) వ్యవస్థాపకుడు దేవెగౌడె మనుమడైన నిఖిల్ కుమారస్వామి-రేవతి దంపతులకు శుక్రవారంనాడు కొడుకు పుట్టాడు. 2020లో ఏప్రిల్‌లో వీరి వివాహమైంది. తన కుమారుడికి కొడుకు పుట్టాడన్న వార్త తెలియగానే నిఖిల్ తండ్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఆయన సతీమణి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని సంబరంలో మునిగిపోయారు. ఏప్రిల్ 2020లో యావత్ దేశం లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో నిఖిల్-రేవతి వివాహం ఫిక్స్ కావడంపై విమర్శలు వచ్చాయి. అయితే, తన కుమారుడి పెళ్లి కోసం కర్ణాటక ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నట్టు అప్పట్లో కుమారస్వామి తెలిపారు. వీరి వివాహానికి కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులైన సుమారు 100 మంది పాల్గొన్నారు. కన్నడ, తెలుగు చిత్రాలతో సినీ కెరీర్ ప్రారంభించిన నిఖిల్, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. మాండ్య నియోజకవర్గం నుంచి జేడీ(ఎస్) అభ్యర్థిగా బరిలోకి దిగారు. మాండ్య నుంచి పోటీ చేసిన నటి సుమలత అంబరీష్ చేతిలో ఓటమి చవిచూశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement