Abn logo
Mar 28 2020 @ 12:29PM

నాని తరహా పాత్రలో నిఖిల్‌?

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ ఇప్పుడు జోరు పెంచాడు. రెండు సినిమాల‌ను ట్రాక్ ఎక్కించాడు. అందులో ఒక‌టి కార్తికేయ సీక్వెల్ ‘కార్తికేయ 2’.. కాగా మ‌రో చిత్రం ‘18 పేజెస్‌’. ఇందులో ముందుగా ‘18 పేజెస్‌’ షూటింగ్ జ‌రుపుకుంటుంది. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు రొటీన్ చిత్రాల‌కు భిన్నంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ట‌. ఇందులో నిఖిల్ మెమొరీ లాస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటాడ‌ట‌. నాని ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’ సినిమా త‌ర‌హాలో నిఖిల్ పాత్ర ఉంటుంది. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడట.

Advertisement
Advertisement
Advertisement