Abn logo
Mar 30 2020 @ 10:14AM

స్పెష‌ల్ సాంగ్ అని వెళితే చుక్క‌లు చూపించిందా?

ఒక‌ప్పుడు పాత్ర‌లు చేయ‌డానికి మాత్ర‌మే ఆస‌క్తి చూపించే స్టార్ హీరోయిన్స్ ఈ మ‌ధ్య స్పెష‌ల్ సాంగ్స్‌లోనూ న‌టిస్తున్నారు. ఈ సాంగ్స్‌లో న‌టించినందుకు వారికి భారీ మొత్త‌మే ముడుతుంది. ఇప్పుడు వీరి బాట‌లో అడుగు పెట్ట‌డానికి సిద్ధ‌మైంద‌ట నిధి అగ‌ర్వాల్‌. ఈ ఇస్టార్ట్ భామ‌ను అల్లుడు అదుర్స్ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ స్పెష‌ల్ సాంగ్ చేయాల‌ని సంప్ర‌దించార‌ట‌. అయితే ఈమె అర‌వై ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను డిమాండ్ చేయ‌డంతో మేక‌ర్స్ మారు మాట్లాడ‌కుండా సైలెంట్ అయిపోయార‌ట‌. మొత్తం సినిమా చేస్తేనే అమ్మ‌డుకి అంత రెమ్యున‌రేష‌నే ఇవ్వ‌డం లేదుగా.. మ‌రి స్సెష‌ల్ సాంగ్‌కు అంత ఇవ్వాలా? అని ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. ఇప్పుడు మ‌రో హీరోయిన్‌ను వెతుక్కునే ప‌నిలో ఉన్నార‌ని స‌మాచారం.

Advertisement
Advertisement
Advertisement