Abn logo
May 30 2020 @ 14:30PM

వలస కార్మికుల కోసం నిధి ఏం చేస్తుందంటే...?

కరోనా ప్రభావంతో దేశమంతటా లాక్‌డౌన్ కొన‌సాగుతుంది.  పేద‌లు, రోజువారీ కార్మికులకు ప‌నిలేకుండా పోయింది. దీంతో చాలా మంది కార్మికులు వారి స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోయారు. ఇంకా చాలా మంది వారి సొంత ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వ‌ల‌స కార్మికులకు చాలా మంది చాలా ర‌కాలుగా సాయ‌మందించారు. వారికి అవ‌స‌ర‌మైన తిండి, ర‌వాణా సౌక‌ర్యం వంటి వాటిని త‌మ వంతుగా కల్పించారు. తాజాగా హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ కూడా వ‌ల‌స కార్మికుల‌కు త‌న వంతు సాయం అందించ‌డానికి ముందుకు వ‌చ్చారు. త‌న వంతుగా వారికి ఆహారాన్ని అందించే ఏర్పాటు చేశారు. ఆ విష‌యాన్ని నిధి అగర్వాల్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. 

Advertisement
Advertisement
Advertisement