Abn logo
Sep 18 2021 @ 12:12PM

రాబోయే మూడు నెలలు ప్రమాదకరం: వైద్య నిపుణులు

న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ గురించి హెచ్చరికలు చేస్తున్న వైద్య నిపుణులు రాబోయే మూడు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ నుంచి కాస్త ఉపశమనం లభించినప్పటికీ, థర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా కరోనా ప్రొటోకాల్ పాటించాలన్నారు. 

రాబోయే మూడు నెలల్లో పండుగలు, ఉత్సవాలు ఉన్నందున జనం ఒక చోట చేరే అవకాశాలున్నాయని, ఫలితంగా భౌతికదూరం అనేది కరువై వైరస్ వ్యాపించేందుకు అవకాశాలున్నాయన్నారు. అందుకే ప్రజలంతా తమతమ ఇళ్లలోనే ఉత్సవాలు చేసుకోవాలన్నారు. అక్టోబరు- నవంబరు మధ్యకాలంలో కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముమ్మర వ్యాక్సినేషన్ ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption