Advertisement
Advertisement
Abn logo
Advertisement

వచ్చే నెలలో.. ప్రవేశ పరీక్షలు

హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు డిసెంబరు 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ సెంట్రల్‌ అడ్మిషన్‌ కమిటీ డైరెక్టర్‌ మంగళవారం తెలిపారు. 2019-20, 2020-21 విద్యా సంవత్సరాలకు ఎంఫిల్‌ ప్రవేశ పరీక్ష తెలుగు, జర్నలిజం, మ్యూజిక్‌, డ్యాన్స్‌, థియేటర్‌ ఆర్స్ట్‌, జ్యోతిష్యం, లింగ్విస్టిక్స్‌, ఫోక్‌ ఆర్ట్స్‌లలో, 2020-21 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష ఆయా విభాగాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష 25 మార్కులకు నిర్వహిస్తామని, పరీక్ష సమయం గంట మాత్రమే ఉంటుందని తెలిపారు. జేఆర్‌ఎఫ్‌, ఎస్‌ఎల్‌ఈటీ కలిగినవారు ప్రవేశ పరీక్ష రాయవలసిన అవసరం లేదన్నారు. 


Advertisement
Advertisement