Abn logo
Sep 27 2021 @ 01:00AM

కొత్తగా 13 కరోనా కేసులు

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 26: జిల్లాలో కొత్తగా మరో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కొత్త మరణాలు సంభవించలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 1,57,563 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1092 మంది మరణించారు. 1,56,396 మంది ఆరోగ్యంగా కోలు కున్నారు. ప్రస్తుతం 75 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు.