Abn logo
Sep 22 2021 @ 10:43AM

పుట్టిన 5 గంటలకే పసిపాపను వాటర్ ట్యాంకులో పారేశారు.. ఆ NRI దంపతులు వెతుక్కుంటూ వచ్చి మరీ..

న్యూఢిల్లీ: ఆడపిల్లను పెంచడం భారం అనుకుందో లేక  మరేదైనా కారణమో రాజస్థాన్‌కు చెందిన ఓ తల్లి సంచలన నిర్ణయం తీసుకుంది. పేగు తెంచుకుని పుట్టిన కూతురిని.. గంటల వ్యవధిలోనే వాటర్ ట్యాంకులో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డ ఆ రెండేళ్ల చిన్నారి ప్రస్తుతం విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పాస్‌పోర్టును కూడా పొందింది. పూర్తి వివరాల్లోకి వెళితే..


అమ్మ కడుపు నుంచి భూమ్మీదికొచ్చిన 5 గంటల్లోనే వాటర్ ట్యాంక్‌లోకి చేరిన చిన్నారిని కొందరు స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో  అక్కడకు చేరుకున్న అధికారులు.. పాపకు వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత అనాథాశ్రమంలో చేర్చారు. ఈ క్రమంలో అక్కడి సిబ్బంది ఆ చిన్నారికి అన్షుల్‌గా నామకరణం చేశారు. దత్తత కోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ప్రాంతానికి చెందిన ఎన్నారై దంపతులుకు అన్షుల్‌కు సంబంధించిన సమాచారం లభించింది. దీంతో రాజస్థాన్‌కు వెళ్లి, పాపను ప్రత్యక్షంగా చూశారు. అనంతరం ఆ బోసినవ్వుల చిన్నారిని దత్తత తీసుకునేందుకు ఓకే చెప్పారు. ఈ క్రమంలో స్టేట్ ఎక్స్‌పర్ట్ అడాప్షన్ ఏజెన్సీ ద్వారా అధికారులు దత్తత ప్రక్రియను సెప్టెంబర్ 2న పూర్తి చేశారు. 


అంతేకాకుండా ఆ ఎన్నారై దంపతులు పాపను యూఏఈకి తీసుకెళ్లేందుకు వీలుగా.. పాస్‌పోర్ట్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 20న ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి , కార్మికశాఖ సహాయ మంత్రి, అల్వార్ కలెక్టర్ చేతుల మీదుగా అన్షుల్ పాస్‌పోర్టును ఎన్నారై దంపతులకు అందజేశారు. కాగా.. వీసా ప్రక్రియ ముగిసిన వెంటనే అన్షుల్.. ఆ దంపతుల వెంట అబుధాబి వెళ్లనుంది. ఈ క్రమంలో స్పందించిన అధికారులు.. ఎన్నారై దంపతులు ఆన్‌లైన్ ద్వారా దత్తత కోసం నమోదు చేసుకున్నారని.. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి సుమారు రెండేళ్ల సమయం పట్టిందని వెల్లడించారు. పాప యోగక్షేమలపై మరో రెండేళ్ల వరకు స్టేట్ ఎక్స్‌పర్ట్ అడాప్షన్ ఏజెన్సీ ఆరా తీసుస్తుందని తెలిపారు. 


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...