Abn logo
Jul 7 2020 @ 03:28AM

ఐపీఎల్‌ నిర్వహణకు కివీస్‌ సైతం

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్‌ ఆతి థ్యం కోసం న్యూజిలాండ్‌ సైతం ముందుకు వచ్చింది. ఇప్పటికే శ్రీలంక, యూఏఈలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. కరోనా నేపథ్యంలో మార్చిలో జరగాల్సిన ఈ మెగా లీగ్‌ వాయుదా పడిన విషయం తెలిసిందే. ‘భారత్‌లో ఐపీఎల్‌ నిర్వహణ సురక్షితం కాకపోతే విదేశాల్లో జరిపే అవకాశాల ను కూడా పరిశీలిస్తాం. శ్రీలంక, యూఏఈలే కాకుం డా తాజాగా కివీస్‌ కూడా ఇందుకు సిద్ధంగా ఉంది. ఏదేమైనా క్రికెటర్ల భద్రత ముఖ్యం కాబట్టి త్వరలోనే ఆయా ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలతో సమావేశమై నిర్ణయిస్తాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement