Abn logo
Oct 24 2020 @ 19:27PM

ప్రకాశ్ ఝాను అరెస్టు చేయాలంటూ నెటిజన్ల ఫైర్

Kaakateeya

బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ ఆశ్రమ్‌పై సోషల్‌ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే ప్రకాశ్‌ ఝా వంటి సినీ దర్శకులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని నిప్పులు చెరిగారు. ఆశ్రమ్‌లో హిందూ మఠాలను కించపరిచినట్లుగా ముస్లిం మదర్సాలను కూడా చిత్రించగలరా అని ప్రశ్నించారు. దేశంలో హిందూత్వాన్ని దెబ్బతీసి, ఇతరమతాలతో సంబంధాలను చెడగొట్టి దేశ ఐక్యతను దెబ్బతీసేందుకే ఇలాంటి వెబ్‌ సిరీస్‌లు తీస్తున్నారని, ఇది బాలీవుడ్‌ జీహాద్‌తో సమానమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వెబ్‌ సిరీస్‌ తీసిన ప్రకాశ్‌ ఝాపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఇస్లాం మత ప్రవక్తపై తీసిన మహ్మద్.. ది మెసెంజర్ ఆఫ్ గాడ్ సినిమానైనే నిషేధించారు కానీ, హిందూ మతాన్ని కించపరిచేలా ఉన్న ఆశ్రమ్ వంటి సినిమాలను మాత్రం ఎందుకు అనుమతిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే  #Arrest_Prakash_Jha అనే హ్యాష్‌ట్యాగ్‌ను నెటిజన్లు ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్‌ట్యాగ్‌పై 50 వేల వరకు ట్వీట్లు పోస్టయ్యాయి.

Advertisement
Advertisement