న్యూఢిల్లీ: భారత్-చైనాల మధ్య ప్రతికూల పరిస్థితుల నేపధ్యంలో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నెటిజెన్లకు పని చెప్పింది. చైనాను గుర్తుకు తెస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలం పండుగా మారుస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మంగళవారం ప్రకటించారు. ఈ పేరు చైనాకు సంబంధించినదని, దీని పేరును తాము మార్చామని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు నగరాలకు పేర్లు మార్చుతుండటం మనందరికీ తెలుసునని, ఇప్పుడు ఇక పండ్ల వంతు వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే నెటిజెన్లు డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్పుపై సెటైర్లు వేస్తున్నారు. చైనాకు బీజేపీ ప్రభుత్వం గట్టి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. ట్విట్టర్లో అయితే మీమ్స్, జోక్స్‌తో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ట్విట్టర్లో నెటిజెన్లు వేస్తున్న సెటైర్లలో కొన్ని ఈ కింద చూడొచ్చు..