Oct 14 2021 @ 15:15PM

మీ తండ్రి జీన్స్ ప్యాంట్‌ను ధరించి వచ్చావా అంటూ హీరోయిన్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

శక్తి కపూర్ కుమార్తెగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి శ్రద్ధా కపూర్. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలోనే  బాక్సాఫీస్ రికార్డులన్నింటిని తిరగరాసింది. ఆమె నటించిన ఆషీకీ -2 చిత్రం 100కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ సోషల్ మీడియా కాలంలో అందరూ హీరో, హీరోయిన్లతో సహా అందరూ ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఈ మధ్యనే అలియా భట్, రష్మిక మందన్న, కరీనా కపూర్‌లు వివిధ కారణాలతో ట్రోలింగ్‌ను గురయ్యారు. ఆ ఘటనలను మరిచిపోముందు మరో హీరోయిన్‌ను నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

లవ్ అజ్ కల్, లుకా చప్పీ, కాక్ టెయిల్, హిందీ మీడియం వంటి చిత్రాలను నిర్మించిన మ్యాడ్ డక్ ఫిలింస్ సంస్థ వద్ద శ్రద్ధా కపూర్ మీడియాకు కనిపించింది. ఆమె ధరించిన దుస్తులను కొంత మంది నెటిజన్లు ప్రశంసించంగా మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. తన దుస్తులు అందంగా ఉన్నాయని కొంత మంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కానీ, కొంత మంది నెటిజన్లు మాత్రం ‘‘ మీ తండ్రి జీన్స్ ప్యాంట్‌ను ధరించి వచ్చావా’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

గతంలో ఆమె స్త్రీ, బట్టి గుల్ మీటర్ చాలు, సాహో, చిచ్చోరే, బాఘీ-3, స్ట్రీట్ డ్యాన్సర్-3 వంటి తదితర చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె లవ్ రంజన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనుంది.

Bollywoodమరిన్ని...