Abn logo
Sep 14 2021 @ 08:24AM

నెల్లూరులో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

నెల్లూరు: జిల్లాలోని కోవూరు సమీపంలో ఏసీసీ కళ్యాణ్ సదన్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  డివైడర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన మహేంద్ర, సుగుణమ్మ, అలీషాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు నెల్లూరు హరనాథపురంకు చెందిన పార్లపల్లి సుధాకర్, అరుణమ్మలుగా గుర్తించారు.  కావలి నుంచి నెల్లూరుకి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.