Abn logo
Sep 23 2021 @ 10:27AM

AP: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం

నెల్లూరు: జిల్లాలోని దొరవారిసత్రం మండలం మోదుగులపాళెం గ్రామంలో విషాదం  చోటు చేసుకుంది.  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు మృతి చెందారు. భార్య వెళ్లిపోయిందని మనస్థాపంతో కుటుంబం మొత్తం ఆత్మహత్యకు యత్నించింది. మెర్లపాక మురళి, అమ్మ మస్థానమ్మ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోగా.... కూతురు కావ్యకి ఉరి వేయగా పరిస్థితి విషమంగా మారింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా కుమారుడు లోకేష్ ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption