Abn logo
Sep 18 2021 @ 08:18AM

నెల్లూరులో రెచ్చిపోయిన ఇసుక మాఫియా

నెల్లూరు:  జిల్లాలోని చేజర్ల మండలం ఉలవపల్లి గ్రామంలో అర్థరాత్రి  ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమ ఇసుక రవాణాని అడ్డుకున్న గ్రామస్తుడు బొలిగర్ల జయరామయ్యపై విచక్షణారహితంగా రాడ్లతో దాడి చేశారు. ఇసుక మాఫియా దాడిలో జయరామయ్య తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం అవడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ వ్యహహారంపై పోలీసులకు ఫోన్ చేసినా పట్టించుకోకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption