Abn logo
Sep 15 2021 @ 11:41AM

నెల్లూరులో చిన్నారుల కిడ్నాప్ కలకలం

నెల్లూరు: జిల్లాలోని ఉదయగిరిలో చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. దిలవర్ బావి  వీధిలో స్కూలుకు వెళుతున్న  ముగ్గురు చిన్నారులను కొందరు వ్యక్తులు  కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కిడ్నాపర్లను  పట్టుకుని పోలీసులకు అప్పటించారు. పోలీస్ స్టేష‌న్ వద్ద  స్థానికులు ఆందోళన చేపట్టారు.