Abn logo
Sep 14 2021 @ 13:08PM

Nelloreలో దోపిడీ దొంగల హల్‌చల్

నెల్లూరు: జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు ఆర్చ్ వద్ద దోపిడీ దొంగల హల్‌చల్ చేశారు. కృష్ణపట్నం నుండి జొన్నవాడకు వెళుతున్న లారీని ఆపిన ఇద్దరు వ్యక్తులు... డ్రైవర్‌ను కత్తులతో బెదిరించి దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.15 వేలను  దోపిడీ చేసి దుండగులు పరారయ్యారు. డ్రైవర్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. డ్రైవర్ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు.