Abn logo
Oct 15 2021 @ 11:07AM

నెల్లూరు జిల్లాలో దారుణం

నెల్లూరు: జిల్లాలో దారుణం జరిగింది. కొండాపురం మండలం, రామంజిపురంలో పదమూడేళ్ల బాలికను దుండగులు కిడ్నాప్ చేసి.. చెరువు వద్దకి తీసుకువెళ్లి వివస్త్రని చేసి వేధింపులకు గురిచేశారు. బహిర్భూమికి వెళ్లిన వారు కేకలు వేయడంతో ప్రధాన నిందితుడు మార్కండేయులు, మరో ముగ్గురు పరారయ్యారు. బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితులను కాపాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.