Abn logo
Mar 6 2021 @ 15:52PM

ఆ తహసీల్దారు చిక్కడు..దొరకడు..

నెల్లూరు జిల్లా: ఆయనో తహసీల్దార్.. పనిచేసిన ప్రతి చోట ఆయనపై అవినీతి ఆరోపణలే. ఎక్కడికక్కడ అధికారపార్టీ నేతలను అండగా పెట్టుకోవడం, రికార్డులు తారుమారు చేయడం, ఇష్టమొచ్చినంత దోచుకోవడం.. ఇలా ఎంతోమంది రైతులు బాధితులయ్యారు. ఓ రైతు కుటుంబం ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అన్నీ తెలిసినా.. ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు హడలిపోతున్నారు. ఇదేమి అన్యాయం సార్ అని వారిని వివరణ అడిగితే తర్వాత చెబుతానంటారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, దుత్తలూరులో తహసీల్దారుగా పనిచేస్తున్న చంద్రశేఖర్ అంతులేని అవినీతి వ్యవహారాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.. వీడియో క్లిక్ చేయండి..