Abn logo
Oct 4 2021 @ 14:04PM

నెల్లూరులో 40 విదేశీ పక్షులు మృతి

నెల్లూరు: జిల్లాలోని తడ మండలం కారిజాత చెరువు ప్రాంతంలో గూడబాతు జాతికి చెందిన నలభై విదేశీ పక్షులు మృతి చెందాయి. సూళ్లూరుపేట నుంచి వచ్చి చెరువులో కలిసే నెర్రికాలువ కాలుష్యం వల్లే చనిపోయాని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్ని రోజులుగా చేపలు కూడా పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి. కాగా మృతి చెందిన విదేశీ పక్షులకి  అటవీశాఖ అధికారులు పంచనమా నిర్వహించారు. మరోవైపు పక్షుల మృతికి అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...