Abn logo
Sep 9 2021 @ 07:23AM

Nellore: ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం

నెల్లూరు: పొదలకూరు మండలంలోని ప్రభుత్వ స్కూల్స్‎లో కరోనా కలకలం రేపుతోంది. మర్రిపల్లి, బిరదవోలు, కొత్త కంభాలపల్లి, పులికల్లులోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా టెస్టుల్లో ఐదుగురు టీచర్లకు కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా టీచర్లకు కూడా అధికారులు కరోనా టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన ఉపాధ్యాయులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరొవైపు పిల్లలని పాఠశాలకు పంపాలంటే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.