Abn logo
Sep 7 2021 @ 07:37AM

Nellore: గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం

నెల్లూరు: గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం రేగింది. చిట్టేడులో 25 మంది, వెంకటగిరిలో ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. శ్రీకాకుళం జిల్లా రిటైర్డ్‌ పీఈటీకి చిట్టేడులో సన్మాన సభ నిర్వహించడంతోనే కరోనా ప్రబలిందని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. వైరస్​ వ్యాప్తితో అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను క్వరంటైన్‌కు తరలించారు.