Abn logo
May 18 2020 @ 05:20AM

పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి

 ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి


కొల్లాపూర్‌, మే 17 : పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఎలాంటి రోగాలు దరిచేరవని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు సీజనల్‌ వ్యాధుల నివారణకు ఇంటి పరిసరాల్లో నిల్వ నీటిని ఎమ్మెల్యే పారబోశారు. అదేవిధంగా కొల్లాపూర్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ మహెముదాబేగంలు తమ నివాస గృహాల్లో ఉన్న నీటి నిల్వలను పారబోసి కేటీఆర్‌ పిలుపును పాటించారు.  

Advertisement
Advertisement