Advertisement
Advertisement
Abn logo
Advertisement

మళ్లీ 17,000 ఎగువకు నిఫ్టీ

ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్‌ సంకేతాలకు అనుగుణంగా బుధవారం దేశీయ ఈక్విటీ సూచీలూ లాభాల్లో పయనించాయి. ఈ మధ్య కాలంలో బాగా తగ్గిన రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సతో పాటు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లలో మదుపర్లు కొనుగోళ్లు పెంచడం ఇందుకు దోహదపడింది. రూపాయి విలువ పుంజుకోవడం, రెండో త్రైమాసిక జీడీపీతో పాటు గతనెలకు తయారీ రంగ పనితీరు, జీఎ్‌సటీ వసూళ్లు మెరుగ్గా నమోదవడం మన మార్కెట్లకు కలిసివచ్చింది. బుధవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 619.92 పాయింట్లు బలపడి 57,684.79 వద్దకు చేరుకుంది. అమ్మకాల ఒత్తిడి కారణంగా గత సెషన్‌లో చేజార్చుకున్న 17,000 స్థాయిని నిఫ్టీ మరుసటి రోజే తిరిగి నిలబెట్టుకోగలిగింది. సూచీ 183.70 పాయింట్ల లాభంతో 17,166.90 వద్ద క్లోజైంది. 


10 ఐపీఓలు.. రూ.10,000 కోట్ల టార్గెట్‌ 

ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ)ల సందడి ఈ నెలలోనూ కొనసాగనుంది. డిసెంబరులో కనీ సం 10 కంపెనీలు ఐపీఓలను ప్రకటించనున్నట్లు మర్చంట్‌ బ్యాంకర్ల ద్వారా తెలిసింది. తద్వారా ఈ కంపెనీలు మార్కెట్‌ నుంచి రూ.10,000 కోట్లకు పైగా నిధులు సమీకరించే అవకాశం ఉంది. కాగా, ఈ నెల 1న (బుధవారం) ప్రారంభమైన టెగా ఇండస్ట్రీస్‌ ఐపీఓకు ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. తొలి రోజు, తొలి గంటలోపే కంపెనీ ఇష్యూ సైజుకు మించి బిడ్లు దాఖలయ్యాయి. మొదటి రోజు ముగిసేసరికి ఇష్యూ సైజుతో పోలిస్తే, 4.67  రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ లభించింది. ఇక ఆనంద్‌ రాఠీ పబ్లిక్‌ ఇష్యూ గురువారం ప్రారంభం కానుంది. ఐపీఓలో విక్రయించే షేరు ధర శ్రేణిని రూ.530-550గా నిర్ణయించింది. తద్వారా రూ.660 కోట్ల వరకు సమీకరించాలనుకుంటోంది. అలాగే, రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్‌ ఇష్యూ ఈనెల 7న ప్రారంభమై 9న ముగియనుంది. ఐపీఓ ధర శ్రేణిని రూ.405-425గా నిర్ణయించిన కంపెనీ.. రూ.1,335 కోట్ల వరకు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

Advertisement
Advertisement