Advertisement
Advertisement
Abn logo
Advertisement

నీతి ఆయోగ్‌ బృందం పర్యటనపై కలెక్టర్‌ సమీక్ష

గన్నవరం, నవంబరు 30 : జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించేందుకు నీతి ఆయోగ్‌ బృందం రెండు రోజుల పర్య టన నిమిత్తం జిల్లాకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కలెక్టర్‌ జె.నివాస్‌ మంగళవారం  ఎయిర్‌ పోర్టులో వివిధ శాఖల   అధికారుల తో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ నీతి ఆయోగ్‌ బృందం బుధవారం ఉదయం  10 గంటలకు గన్న వరం మండలం వీరపనేనిగూడెం చేరుకుని మధ్యాహ్నం 12 గంటల వరకూ తెల్లం విజయకుమార్‌తో సమావేశమై ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అంశాలను తెలుసుకోవటంతో పాటు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తారని చెప్పారు. 

సచివాలయం, ఆర్బీకే పరిశీలన 

నీతి ఆయోగ్‌ బృందం బుధవారం వీరపనేని గూడెం రానున్న సందర్భంగా కలెక్టర్‌ జె.నివాస్‌, జేసీలు మాధవీలత, శివశంకర్‌లతో కలిసి మంగళవారం గ్రామ సచివాలయం, ఆర్బీకే సెంటర్‌ను పరిశీలించారు. సచివాల యంలో డ్వాక్రా మహిళలు, వలంటీర్‌లతో సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశా రు. సచివాలయంలో అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం ఆర్‌బీకేను పరిశీ లించారు. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవ లను ఏవో ఎన్‌ఎల్‌ తేజస్వీ వివరించారు. కియోస్కో మిషన్‌ వల్ల ఉపయోగాలను తెలి పారు. ఎరువులు, పురుగు మందుల సరఫ రాపై కలెక్టర్‌ ఆరా తీశారు. ధాన్యం కొనుగో లుపై రైతులకు అవగాహన కల్పించాల న్నారు. ప్రస్తుత ఖరీ్‌ఫలో 8.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. అందుకు అనుగుణంగా ధాన్యం కొనుగోలులో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికా రులు చర్యలు తీసుకోవాలన్నారు. గోనె సంచు లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ధాన్యం తేమ కొలిచే యంత్రాన్ని పరిశీలించారు. నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి, తహసీల్దార్‌ నరసింహారావు, ఎంపీడీవో సుభాషిణి, ఏడీఏ జయప్రద, సర్పంచ్‌ ఆరేపల్లి జేజమ్మ,  కార్యదర్శి నామేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement