Abn logo
Oct 24 2020 @ 17:51PM

బాలిక ఉసురు తీసిన నీట్ తప్పుడు స్కోర్

Kaakateeya

భోపాల్ : ఎన్నెన్నో ఆశలతో నిద్రాహారాలు మానుకుని చదివిన విద్యార్థిని తప్పుడు స్కోరు చూసి, ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలచివేసింది. ఆ విద్యార్థిని ఓఎంఆర్ షీట్‌ను రీవాల్యుయేషన్ చేస్తే ఆమెకు అన్యాయం జరిగిందని వెల్లడైంది. మధ్యప్రదేశ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఛింద్వారా జిల్లాకు చెందిన 18 ఏళ్ళ బాలిక నీట్ పరీక్షలు రాశారు. ఆమెకు కేవలం 6 మార్కులు వచ్చినట్లు నీట్ ఫలితాలు వెల్లడించాయి. దీంతో ఆమె తీవ్రంగా మనస్తాపం చెందారు. ఆమె తన గదిలో ఉరి వేసుకుని తన ప్రాణాలు తీసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపించారు. ఆమె నీట్ ఓఎంఆర్ షీట్‌ను రీవాల్యుయేషన్ చేస్తే, ఆమెకు 590 మార్కులు లభించినట్లు వెల్లడైందని పరాసియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సుమేర్ సింగ్ జగ్టే తెలిపారు. 


Advertisement
Advertisement