Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రాకు తీవ్రమైన జ్వరం!

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌‌లో భారత్‌కు పసిడి పతకం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా ప్రస్తుతం తీవ్రమైన జ్వరంతో సతమతమవుతున్నాడు. అదృష్టవశాత్తూ.. అతడికి కరోనా సోకలేదని తేలింది. అతడు దగ్గుతో కూడా బాధపడుతున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నీరజ్ విశ్రాంతి తీసుకుంటుంన్నాడట. దేశానికి పసిడి పతకం తెచ్చిన నీరజ్ చోప్రా పేరు ఇటీవల దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు..జావెలిన్ త్రో గురించి తెలిసిన వారే నీరజ్ గురించి వినగా..ప్రస్తుతం అతడు దేశప్రజలందరికీ చిరపరిచితుడైపోయాడు. నీరజ్ పాపులారిటీ అమాంతంగా ఆకాశాన్ని తాకింది. 

Advertisement
Advertisement