Abn logo
Jun 2 2020 @ 04:05AM

రక్తదానంతో ప్రాణదాతలు కావాలి

 జిల్లా చైర్‌పర్సన్‌ సరిత


అయిజ, జూన్‌ 1 : రక్తదానంతో ప్రాణదాతలు కావాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత అన్నారు. మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో టీఆర్‌ఎస్వీ జిల్లా కన్వీనర్‌ కన్వినర్‌ కుర్వ పల్లయ్య అధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మందా జగన్నాథ్‌ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించామని గుర్తు చేశారు. కార్యక్రమంలో తిరుపతయ్య, వడ్డెపల్లి శ్రీను, మంద శ్రీనాథ్‌, ఆత్మలింగారెడ్డి, టీఆర్‌ఎస్వీ నాయకులు భరత్‌, లాల్‌బాషా, మధు, ఖాజ, నాయుడు, మహేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement