Abn logo
May 28 2020 @ 02:21AM

యూఏఈ నుంచి స్వదేశానికి చేరుకున్న 7500 మంది ప్రవాసులు

దుబాయి: కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పటి వరకు యూఏఈలో చిక్కుకున్న దాదాపు 7500 మంది భారతీయులను ఇండియాకు తరలించినట్లు దుబాయిలోని భారత కాన్సులేట్ కార్యాలయం ప్రకటించింది. అందులో సుమారు 800 మంది గర్భిణీ స్త్రీలు, 850 మంది పేషెంట్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా తరలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని వెల్లడించింది. కాగా.. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో దేశాలన్నీ స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. అయితే లాక్‌డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్న భారత ప్రభుత్వం.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు ‘వందే భారత్ మిషన్’ ప్రారంభించింది. ఇప్పటికే ‘వందే భారత్ మిషన్’ మొదటి దశ.. పూర్తి కాగా.. రెండో దశ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యూఏఈ నుంచి ఇప్పటి వరకు 7500 మందిని ఇండియాకు తరలించినట్టు దుబాయిలోని భారత కాన్సులేట్ కార్యాలయం ప్రకటించింది. యూఏఈ నుంచి భారత్‌కు తిరిగి రావడానికి సుమారు 3,50,000 మంది ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement