Abn logo
May 23 2020 @ 19:59PM

లాక్‌డౌన్ వేళ యూపీకి తిరిగి వచ్చిన 21 లక్షల మంది

లక్నో: కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న 21 లక్షల మందికి పైగా ప్రజలు స్వస్థలాలకు తిరిగి వచ్చారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. రైళ్లు, బస్సులు సహా ఇతర ప్రయాణ సాధనాల ద్వారా వీరంతా వచ్చినట్టు తెలిపింది. ఇక్కడికి వచ్చిన మొత్తం 21 లక్షల మందిలో వలస కార్మికులు 13.54 లక్షల మంది దాకా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల మొదటి వారం నుంచి ఇప్పటి వరకు 1,018 ప్రత్యేక రైళ్లలో వీరంతా రాష్ట్రానికి చేరుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.


కాగా బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా విధిగా క్వారంటైన్‌లో ఉండేలా ప్రత్యేక బృందాలు నిత్యం పర్యవేక్షిస్తున్నట్టు అదనపు ముఖ్య కార్యదర్శి (హోం, సమాచార) అవనీశ్ అవస్తి ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘‘శనివారం, ఆదివారం మరో 178 రైళ్లు రాష్ట్రానికి వస్తాయని అంచనా వేస్తున్నాం. తిరిగి వచ్చిన వారంతా విధిగా లాక్‌డౌన్ పాటించేలా వారి గృహాలపై పూర్తి వివరాలతో పేపర్ స్లిప్పులు అంటిస్తామన్నారు. పర్యవేక్షణ బృందాలతో నిత్యం వారిని గమనిస్తూ క్వారంటైన పాటించేలా చూస్తాం..’’ అని ఆయన తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement