Abn logo
Jul 7 2020 @ 10:44AM

మనోబాల దర్శకత్వంలో ‘న‌న్యం’

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత మనోబాలా పిక్చర్‌హౌస్‌ బ్యానర్‌పై ‘ట్రెండ్‌ లౌడ్‌’ సంస్థతో కలిసి లాక్‌డౌన్‌ సమయంలో ‘నన్యం’ అనే లఘుచిత్రాన్ని రూపొందించారు. ఈ  చిత్రం త్వరలో ప్రసారం కానుంది. ఇందులో యువనటుడు ఉదయ, అమ్ము, జయ ప్రకాష్‌, సత్యప్రియ, కామేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సంద‌ర్భంగా మ‌నోబాల మాట్లాడుతూ ‘‘కుల మతాల పట్టింపుతో ఉన్న తండ్రికి, కులమతాలు లేని సమాజాన్ని రూపొందించాలని తపించే ప్రేమికుడి మధ్య జరిగే ఘర్షణల నడుమ చిక్కుకుని ఇబ్బందులకు గురయ్యే యువతి కథే ‘నన్యం’. ప్రస్తుత కరోనా వైరస్‌ వ్యాప్తి సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో జరిగే సంఘటనల సమాహారంగా పటుత్వమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించాను’’ అని తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement