Abn logo
Oct 16 2021 @ 17:46PM

ఆర్యన్ కేసు‌లో మళ్లీ మంత్రి సంచలన ఆరోపణ

ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ‌పైన, ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చీఫ్ ఇన్వెస్టిగేటర్‌గా ఉన్న ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాఖండే పైన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ శనివారంనాడు కొత్త ఆరోపణలు చేసారు. వాఖండే పలు కేసుల్లో తన మిత్రులను సాక్షులుగా వాడుకుంటున్నారని వరుస ట్వీట్లలో ఆరోపించారు. తన వాదనకు బలం చేకూర్చేలా ఫ్లెచర్ పటేల్ అనే వ్యక్తి వివారాలను కూడా ఆయన షేర్ చేశారు. ఎన్‌సీబీ మూడు కేసుల్లో ఫ్లెచర్ సాక్షిగా ఉన్నాడు. సమీర్‌ వాంఖడేతో ఫ్లెచర్ పటేల్‌కు సంబంధాలున్నాయని నవాబ్ మాలిక్ ఆరోపించారు. వాంఖడే సోదరితో ఫ్లెచర్ కలిసి ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఫోటోను కూడా మాలిక్ ఈ ట్వీట్‌కు జత చేశారు. ఆర్యన్ ఖాన్ కేసుతో ఈ ఆరోపణలకు నేరుగా సంబంధం లేనప్పటికీ, ఎన్‌సీబీపై వరుస ఆరోపణాస్త్రాలు గుప్తిస్తున్న నవాబ్ మాలిక్ తాజాగా ఈ ఆరోపణలు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption