Abn logo
May 20 2020 @ 21:45PM

సెయింట్ లూయిస్‌లో అగ్నిమాపక సిబ్బందికి నాట్స్ సాయం

  • మూడు ఫైర్ స్టేషన్లలో సిబ్బందికి ఆహార పంపిణీ

సెయింట్ లూయిస్: కరోనా నియంత్రణకు ముందుండి పోరాడుతున్న అగ్ని మాపక సిబ్బందికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) అండగా నిలిచింది. సెయింట్ లూయిస్‌లోని వైల్డ్ వుడ్, మాంచెస్టర్, బాల్విన్ నగరాల్లో అగ్నిమాపక సిబ్బందికి పిజ్జా లంచ్‌ను ఏర్పాటు చేసింది. కరోనాపై పోరులో అగ్ని మాపక సిబ్బంది కూడా ముందుండి తమ వంతు పోరాటం చేస్తున్నారని నాట్స్ సభ్యులు తెలిపారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ను ప్రోత్సహించేందుకు నాట్స్ ఆహార పంపిణీ చేసిందని.. ఉద్యోగులందరికీ పిజ్జా లంచ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్  మంచికలపూడి, నాట్స్ సర్వీస్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం, నాట్స్ సెయింట్ లూయిస్ విభాగం సమన్వయకర్త నాగ శ్రీనివాస్ శిష్ట్లా తో పాటు నాట్స్ వాలంటీర్లు అప్పలనాయుడు గండి, శివ కృష్ణ మామిళ్లపల్లి, శ్రీరామ్ కారుమూరి, రాజశేఖర్, ఈశ్వర్ యడ్లపల్లి, వెంకట్ పసుపులేటి, అయినగుండ్ల తదితరులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ సుధీర్ అట్లూరి ఈ పంపిణీకి తన వంతు సాయాన్ని అందించారు.

Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement
Advertisement