Abn logo
May 20 2020 @ 22:08PM

వలస కూలీలకు నాట్స్ సాయం

  • శ్రీకాకుళం జిల్లాలో నిత్యావసరాలు పంపిణీ

మర్రిపాడు, శ్రీకాకుళం: కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో వలస కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తెలుగునాట వలస కూలీల పరిస్థితి తెలుసుకున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. శ్రీకాకాళం జిల్లా సంతబొమ్మాళి మండలం పెద్ద మర్రిపాడు గ్రామంలో 100 కుటుంబాలకు నాట్స్ నిత్యావసరాలను పంపిణీ చేసింది. ఇక్కడ పరిస్థితిని సెయింట్ లూయిస్ పెద్దలు, స్థానిక తెలుగు సంఘం(టీఏఎస్ సెక్రటరీ) రమేష్ కొందముట్టి.. నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి తన వంతు సాయం చేశారు. 100 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీకి కావాల్సిన సాయాన్ని చేసి మానవత చాటుకున్నారు. వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తమ దృష్టికి తెస్తే వెంటనే తాము తగిన సాయం చేస్తున్నామని ఈ సందర్భంగా నాట్స్ తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement