Abn logo
Jan 21 2021 @ 11:33AM

మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలకు ప్రధాని మోదీ అభినందనలు!

న్యూఢిల్లీ: జనవరి 21న దేశ చరిత్రలో ఎన్నో ముఖ్య సంఘటనలు జరిగాయి. 1972, జనవరి 21న మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలు ఉద్భవించాయి. వీటికి ప్రత్యేక రాష్ట్ర హోదా దక్కి 49 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ మూడు రాష్ట్రాలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా  మణిపూర్, మేఘాలయ, త్రిపుర ప్రజలకు అభినందనలు. ప్రాకృతిక సౌందర్యం, ఘన చరిత్ర, సంస్కృతి మొదలైవాటితో ఈ రాష్ట్రాలు ఎంతో ఆకర్షణీయంగా మారాయి. అభివృద్ధి బాటలో పయనిస్తున్న ఈ రాష్ట్రాలకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ రాష్ట్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన ట్వీట్‌లో మణిపూర్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశాభివృద్ధిలో మణిపూర్ పాత్ర గణనీయమైనది. త్రిపుర ప్రజలకు శుభాకాంక్షలు. వారు స్థానిక సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement