Abn logo
Oct 21 2021 @ 23:27PM

జాతీయ రహదారికి మరమ్మతు పనులు

దర్భగూడెం వద్ద జాతీయ రహదారి పనులు

జీలుగుమిల్లి, అక్టోబరు 21: ఎట్టకేలకు జాతీయ రహదా రికి మోక్షం కలిగింది. కొన్ని నెలలుగా దర్భగూడెం నుంచి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు తాటియాకులగూడెం వరకు రోడ్డుపై గోతుల్లో వాహనాల రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం జాతీయ రహదారి నిర్వహణ పనుల్లో భాగంగా మరమ్మతు పనులు చేపట్టారు. ఇప్పటి వరకు వర్షాలు పడడంతో పనులు నిలిపి వేసినట్లు రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు చెబుతున్నారు. గోతులు పడ్డ చోటల్లా తారువేసి రహదారి నిర్మాణం చేపడుతున్నారు.