Abn logo
Sep 27 2021 @ 00:02AM

ముగిసిన నాటక పోటీలు

చెరుకూరి సాంబశివరావుకు బహుమతి అందజేస్తున్న ఉపసభాపతి కోన రఘుపతి

గుంటూరు(సాంస్కృతికం), సెప్టెంబరు 26: స్థానిక బృందావన గార్డెన్స శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు సారధ్యంలో యువ కళావాహిని ఆధ్వర్యంలో డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత వారు నిర్వహిస్తున్న 27వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలు ఆదివారం  ముగిశాయి. పోటీల్లో మిత్ర క్రియేషన్స హైదరాబాద్‌ వారిచే కోన గోవిందరావు రచించిన ‘లక్ష్మణరేఖ దాటితే’, ఉషోదయ కళానికేతన కట్రపాడు వారిచే చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వం వహించిన ‘మహర్షి’ నాటికలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు డాక్టర్‌ లంకా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, అతిథులుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షుడు మేకల మోహనరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయ్‌బాబు, రామరాజు ఫౌండేషన చైర్మన రామరాజు శ్రీనివాసరావు, యువ కళావాహిని అధ్యక్ష కార్యదర్శులు జి.మల్లికార్జునరావు, బొప్పన నరసింహారావులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఉత్తమ ప్రదర్శనగా మిత్ర క్రియేషన్స హైదరాబాద్‌ వారి ‘లక్ష్మణరేఖ దాటితే’, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ఉషోదయ కళానికేతన కట్రపాడు వారి ‘మహర్షి’ నాటికలు నిలిచాయి. కార్యక్రమాన్ని డి.తిరుమలేశ్వరరావు, జీవీజీ శంకర్‌ పర్యవేక్షించారు.