Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీలో చేరిన దేవగుడి నారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో కడప జిల్లా జమ్మలమడుగు నేతలు టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలను టీడీపీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి నారాయణరెడ్డి స్వయానా సోదరుడు కావడం గమనార్హం. టీడీపీలో చేరిన వెంటనే భూపేష్ రెడ్డికి జమ్మలమడుగు భాద్యతలను చంద్రబాబు అప్పగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జిల్లా జమ్మలమడుగు టీడీపీకి కంచుకోట అని అన్నారు. కొందరు నాయకులు పార్టీని వీడి వెళ్లారని, జమ్మలమడుగులో పార్టీ కోసం పనిచేస్తున్న అందరికీ గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. జగన్‌రెడ్డి అన్నీ గాలిమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్‌రెడ్డి లాంటి వారు ఉంటారనే ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాశారని తెలిపారు. సీఎం గాల్లో వచ్చారు... గాల్లోనే వెళ్తున్నారని చంద్రబాబు ఎద్దేశాచేశారు.


వాస్తవానికి జమ్మలమడుగు నియోజకవర్గంలో దేవగుడి వర్గం, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య సుదీర్ఘకాలంగా ఫ్యాక్షన్‌ నెలకొంది. రామసుబ్బారెడ్డి వర్గం టీడీపీలో ఉండగా దేవగుడి వర్గం మొదట కాంగ్రెస్‌లో.. తర్వాత వైసీపీలో చేరింది. దేవగుడి వర్గం తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలో చేరి మంత్రి అయ్యారు. రామసుబ్బారెడ్డిని టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీని చేసి విప్‌ పదవి ఇచ్చింది. గత ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా, ఆదినారాయణరెడ్డి ఎంపీగా పోటీ చేశారు. కాని ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోగా... రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. 

Advertisement
Advertisement