Abn logo
Jul 15 2020 @ 09:23AM

నరసరావుపేటలో మళ్లీ కల్లోలం

నరసరావుపేట(గుంటూరు): నరసరావుపేటలో ప్రమాదకర స్థాయిలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య  పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. పట్టణంలో ఏకంగా ఏడు రోజుల్లో 134 కేసులు నమోదయ్యాయి. మంగళవారం 25 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. పాజిటివ్‌ వ్యక్తులకు సంబంధించిన కాంటాక్ట్‌లను గుర్తించి పరీక్షలు నిర్వహించడంలో జాప్యంతో వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 439కి చేరింది.


ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ఇద్దరు ప్రధాన అర్చకులకు కరోనా సోకింది. దీంతో బుధవారం నుంచి ఈ నెల 18 వరకు ఆలయ ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్టు ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి  తెలిపారు.  

Advertisement
Advertisement
Advertisement