Abn logo
May 4 2021 @ 14:56PM

వారి ఆరోగ్యం క్షీణిస్తే ప్ర‌భుత్వానిదే బాధ్య‌త: నారా లోకేష్

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, వైసీపీపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల ప్రాణాలు క‌రోనాకి వ‌దిలి, ప్ర‌తిప‌క్షంపై క‌క్ష సాధిస్తోన్న దేశంలో ఏకైక ముఖ్య‌మంత్రి మూర్ఖ‌పు‌రెడ్డి అని విమర్శించారు.  పేషెంట్ల‌కు ఆక్సిజ‌న్ అందించ‌డం మానేసి టీడీపీపై ఆధిప‌త్యం సాధించేందుకు జగన్‌రెడ్డి తాడేప‌ల్లిలో వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారని నారా లోకేష్ ధ్వజమెత్తారు.


రాజ‌ధానిపై వైసీపీ కుట్ర‌లను బ‌ట్ట‌బ‌య‌లు చేశార‌నే క‌క్ష‌తో సంగం డెయిరీ చైర్మ‌న్‌ ధూళిపాళ్ల న‌రేంద్ర‌ని అక్ర‌మంగా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. సంగం డెయిరీ ఎండీ గోపాల‌కృష్ణ‌న్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణగా తేలిందన్నారు. ధూళిపాళ్ల న‌రేంద్ర‌ కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్నారని చెప్పారు. వీరిద్ద‌రినీ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌కుండా ఏంటీ శాడిజం మూర్ఖ‌పురెడ్డి అని లోకేష్ ప్రశ్నించారు. త‌క్ష‌ణ‌మే న‌రేంద్ర, గోపాల‌కృష్ణ‌న్‌లకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. వారి ఆరోగ్యం క్షీణిస్తే ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌ అని లోకేష్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement