Abn logo
Mar 26 2020 @ 11:22AM

సిక్కోలు సింహంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు: లోకేష్

అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పుట్టిన రోజు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన పలువురు ప్రముఖులు, నేతలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ బర్త్‌డే విషెస్ తెలిపారు.


 చీల్చి చెండాడే సిక్కోలు సింహం.. 

అధికార పార్టీ అరాచకాలను ఎప్పటికప్పుడు చీల్చి చెండాడే సిక్కోలు సింహం.. మా కింజరపు అచ్చెన్నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఆనందంగా జరుపుకుంటూ, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు అండగా పదికాలాలు నిలవాలని మనసారా కోరుకుంటున్నాను అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సైతం అచ్చెన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement