Abn logo
Jul 28 2021 @ 04:14AM

ఒసాకాకు షాక్‌

సొంతగడ్డపై జరుగుతున్న విశ్వక్రీడల్లో పతకం ముద్దాడాలనుకున్న జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌, నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌ నవోమి ఒసాకా ఆశలు అడియాసలయ్యాయి. ఈ టాప్‌ ప్లేయర్‌ జోరుకు చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి మార్కెటా వొండ్రుసోవా బ్రేక్‌ వేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడోరౌండ్లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ మాజీ ఫైనలిస్టు వొండ్రుసోవా 6-1, 6-4తో ఒసాకాను వరుససెట్లలో చిత్తుచేసి  క్వార్టర్స్‌ చేరింది. మిగతా మ్యాచుల్లో స్వితోలినా 5-7, 6-3, 6-4తో సక్కారిపై, జియోర్జి 6-4, 6-2తో ప్లిస్కోవాను ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.