Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్యాంపస్‌కు కొత్త సొబగులు

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణలో రికార్డులు సొంతం

 నన్నయ వర్సిటీ వీసీ జగన్నాథరావు

తాడేపల్లిగూడెం రూరల్‌, నవంబరు  27: తాడేపల్లిగూడెంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను అభివృద్ధి చేసి ఒక మోడల్‌ క్యాంపస్‌గా తీర్చిదిద్దుతామని  నన్నయ్య వర్సిటీ వీసీ  మొక్క జగన్నాథరావు అన్నారు. తాడేపల్లిగూడెంలోని క్యాం పస్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లోని క్యాంటీన్‌ను ప్రారంభించి నూతనంగా నిర్మిస్తున్న ఫార్మసీ భవనాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో  మాట్లాడుతూ క్యాంపస్‌కు బస్సు సదుపాయం ఏర్పాటు చేస్తామని, నూతన సంవత్సర కానుకగా  క్యాంపస్‌ను తీర్చిదిద్ది విద్యార్థులకు కానుకగా ఇస్తామన్నారు. ఇంటర్నెట్‌,  వైఫై సదుపాయం కల్పించ డంతో పాటు ల్యాబ్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. ఆదికవి నన్నయ్య వర్సిటీ అతితక్కువ కాలంలో 100 పైగా  ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించి ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సాధించిందని తెలిపారు.  ప్రత్యేకాధికారి ఆచార్య పి. రమేష్‌, సిబ్బంది  వీసీని సత్కరించారు. 

Advertisement
Advertisement