Oct 14 2021 @ 14:05PM

nani 29 : సింగరేణి బ్యాక్ డ్రాప్ లో సినిమా?

నేచురల్ స్టార్ నానీ క్రితం నెలలో ‘టక్ జగదీశ్’ చిత్రంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. సినిమాకి మిశ్రమ ఫలితం రావడంతో .. తన తదుపరి చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు నానీ. ప్రస్తుతం ఆయన ‘శ్యామ్ సింగరాయ్’ అనే పీరియాడికల్ మూవీలో నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా తో పాటు నానీ..  వివేక్ ఆత్రేయ ‘అంటే సుందరానికీ ..’ అనే మరో మూవీని కూడా ట్రాక్ లో పెట్టారు. 

ఇక నానీ 29వ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ దసరా సందర్భంగా రేపు ( శుక్రవారం) మధ్యాహ్నం 1 : 53కి ప్రకటించబోతున్నారు. శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానున్నారట. సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అతడు .. నానీ కోసం ఓ ఆసక్తికరమైన కథ రెడీ చేసుకున్నట్టు సమాచారం.  సింగరేణి బ్యాక్ డ్రాప్ లో కథ సాగుతుందట. నానీ ఇంతకు ముందు ఈ తరహా సినిమాలో నటించలేదు కాబట్టి.. తనకిది కొత్తగా ఉంటుదని భావిస్తున్నారట. మరి ఈ సినిమాకి ఏ టైటిల్ ఖాయం చేస్తారో తెలియాలంటే.. రేపటి వరకూ ఆగాల్సిందే.