Abn logo
Sep 21 2020 @ 19:38PM

జీవనం, జీవితంలపై నమ్రతా పోస్ట్ వైరల్‌

Kaakateeya

ఈ లాక్‌డౌన్‌లో కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన వారు సెలబ్రిటీల పరంగా చెప్పాలంటే ఖచ్చితంగా మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్‌ బాబుల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. అంతకు ముందు మహేష్‌ ఎప్పుడో గానీ సోషల్‌ మీడియాలో స్పందించేవారు కాదు. అలాంటిది ఆయన ఈ లాక్‌డౌన్‌లో జాగ్రత్తలతో పాటు, ఎన్నో విషయాలతో ప్రేక్షకులకు దగ్గరగా ఉన్నారు. అయితే మహేష్‌లో ఇంత మార్పుకు కారణం ఆయన భార్య నమ్రతా శిరోద్కరే అని అందరి భావన. తాజాగా ఆమె.. తన భర్త మహేష్‌ బాబు ఒడిలో కూర్చుని ఉన్న ఓ క్యూట్ పిక్‌ను పోస్ట్ చేసి.. ఈ ఫొటో తీసింది తమ కూతురు సితార అని తెలిపారు.

అంతే కాకుండా.. ''మన జీవన ఉనికికి మూలకారణం ప్రేమ అని నేను నమ్ముతున్నాను. ఆనందకరమైన జీవితం కేవలం ప్రేమతోనే సాధ్యమవుతుంది. దయ, కరుణ, జాలి వంటి వన్నీ ప్రేమతో నిండిన భావోద్వేగం నుంచే ఉత్పన్నమవుతాయి. ఇది నా అభిప్రాయం. కాబట్టి అందరూ ప్రేమగా ఉంటూ ఒకరిపై ఒకరు దయ కలిగి ఉండండి. సంతోషంగా, క్షేమంగా, దయతో ఉండండి. మనకి జీవించడానికి ఒక జీవనం, అలాగే ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఇవన్నీ నా నిజమైన సంతోషంలో ఉన్నాయి.." అని నమ్రతా శిరోద్కర్‌ తన ఇన్‌స్టాగ్రమ్‌లో పేర్కొంది. ఆమె పోస్ట్ చేసిన పిక్‌ మాత్రం ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. 


Advertisement
Advertisement
Advertisement