Abn logo
Jul 7 2020 @ 13:46PM

గౌతమ్ రేర్ పిక్ పోస్ట్ చేసిన నమ్రత!

సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. మహేష్ గురించి, పిల్లలు గౌతమ్, సితారల గురించి తరచుగా పోస్టులు చేస్తుంటారు. వారి ఆటపాటలకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటుంటారు.

 

తాజాగా నమ్రత షేర్ చేసిన గౌతమ్ అరుదైన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. `ఎలూసివ్ (అంతుచిక్కని) సన్` అంటూ నమత్ర కామెంట్ కూడా చేశారు. ఈ ఫొటోలో గౌతమ్ హెయిర్ స్టైల్, స్మైల్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. `ఫ్యూచర్ సూపర్‌స్టార్` అంటూ మహేష్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మహేష్ నటించిన `వన్: నేనొక్కడినే` సినిమాలో గౌతమ్ నటించిన సంగతి తెలిసిందే. Advertisement
Advertisement
Advertisement